రాజమోళి క(ళ)లకి కట్టుబడి మూడేళ్లు బాహుబలి సెట్స్ లోనే గడిపేశాడు ప్రభాస్. ఇప్పుడా చెర నుండి బయటపడే సమయం దగ్గర్లోనే ఇటీవల జరిగిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. దాంతో ప్రభాస్ తర్వాతి సినిమాల విషయం చర్చనీయంగా మారింది. నిజాంనికి ఈ చర్చ గత కొంతకాలంగా సాగుతున్నదే అయినా వాటిలో వాస్తవమెంత అన్నది ప్రభాస్ స్పష్టం చేశాడు.
‘బాహుబలి2’లో రెండు పాటల మినహా, కొంత ప్యాచ్ నవంబర్ నాటికి పూర్తయిపోతుంది. ప్రభాస్ అక్కడికి ఫ్రీ అయిపోతాడు. ఒకట్రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ముందుగానే కమిట్ అయిన సుజిత్ సినిమాని డిసెంబర్ లో సెట్స్ మీదికి తీసుకెళ్తానన్న ప్రభాస్ వెనువెంటనే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణతో జతకట్టనున్నాడు. తర్వాతి పెదనాన్న కృష్ణంరాజు సంస్థ గోపికృష్ణ మూవీస్ లో ఓ సినిమా ఉంటుందన్న ఈ బాహుబలి స్టార్ ఈ మూడు సినిమాలే కన్ఫర్మ్ అయినవని క్లారిటీ ఇచ్చాడు. ఫలానా దర్శకులతో మళ్ళీ చేస్తున్నారటగా అన్న ప్రశ్నకు వాటి గురించి నేనే చెబుతాను అన్నాడు. అంటే ఇంకా చర్చల దశలోనే ఉన్నాయన్నమాట. సుజిత్ సినిమా డిసెంబర్ లో మొదలవుతుంది గనక బాహుబలి పార్ట్ 2 విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ సినిమా కూడా తెరమీదికి వచ్చే అవకాశముంది.