Prabhas, Anushka: ప్రభాస్ సినిమాలో ఆ షాట్ రిపీట్ అయిందా?

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.

అయితే తాజాగా రిలీజైన సెకండ్ సింగిల్ ప్రోమోలో ప్రభాస్ పూజా హెగ్డేల ఫోజ్ ఒకటి మిర్చి సినిమా ఫోజ్ ను పోలి ఉండటం గమనార్హం. మిర్చి, రాధేశ్యామ్ రెండు సినిమాలలో ప్రభాస్ హీరో కాగా హీరోయిన్ మాత్రం మారింది. ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రభాస్ అనుష్క కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ అనుష్క జంట గురించి ఎన్నో గాసిప్స్ వైరల్ అయినా తాము ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జంట చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది. అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus