Prabhas: 2020 ని మించనున్న.. 2022 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు..!

సంక్రాంతి అన్నాక పెద్ద సినిమాలు విడుదలవ్వడం మామూలే..! సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు చూసేస్తారు అందులో సందేహం లేదు. ఈసారి కూడా 4 పెద్ద సినిమాలు సంక్రాంతికి బరిలోకి దిగనున్నాయి. అయితే ఈసారి కాస్త టఫ్ ఫైట్ అని చెప్పాలి. ఎందుకంటే… ఓ పాన్ వరల్డ్ సినిమా, పాన్ ఇండియా సినిమా కూడా ఇదే సంక్రాంతికి రంగంలోకి దిగనున్నాయి. ‘బాహుబలి’ సృష్టికర్త అయిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో, ‘బాహుబలి’ కథానాయకుడైన ప్రభాస్ ‘రాధే శ్యామ్’ తో పోటీ పడనున్నారు. నిజానికి ఈ రెండు చిత్రాలకీ భారీ స్థాయిలో థియేటర్లు కావాలి.

ఓపెనింగ్స్ తక్కువైతే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమైపోతుంది. అంతేకాదు బాలీవుడ్లో ఈ రెండు చిత్రాలకి బోలెడంత క్రేజ్ ఉంది. ఇవి రెండు ఒకేసారి విడుదలైతే అక్కడ ఓపెనింగ్స్ విషయంలో కూడా తేడా కొట్టేస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ టార్గెట్ రూ.1000 కోట్ల వరకు ఉంది. ‘రాధేశ్యామ్’ టార్గెట్ రూ.300 కోట్లు. రెండు పెద్ద టార్గెట్లే కానీ..’రాధే శ్యామ్’ తో పోలిస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ టార్గెట్ మూడున్నర రెట్లు ఎక్కువ. హిందీలో ‘బాహుబలి’ తో పాటు ‘సాహో’ కూడా విజయం సాధించడంతో ‘రాధే శ్యామ్’ కోసం ఏకంగా 3700 స్క్రీన్లు బుక్ అయ్యాయి.

ఇలా చూసుకుంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కి పెద్ద సమస్యే ఏర్పడేలా ఉంది. నిజానికి 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ను విడుదల చేస్తున్నట్టు ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే ముందే ప్రకటించారు నిర్మాతలు. తర్వాత జనవరి 7న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. ‘భీమ్లా నాయక్’ బరిలో నుండీ తప్పుకున్నా ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో ఉంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కి పెద్ద దెబ్బ పడుతుంది. ఈ రెండిటిలో ఒకటి ఏ ‘రిపబ్లిక్ డే ‘ కో రావడం ఉత్తమం. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus