తెలుగు సినీ పరిశ్రమలో ఈశ్వర్ చిత్రంతో తొలి అడుగు వేసి బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైన నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ ఛత్రపతి నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ కి ఈ జన్మదినం వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకో ఈ ఆర్టికల్ చదివితే మీకే తెలుస్తుంది.
నంబర్ 1ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు 1979 అక్టోబర్ 23 న జన్మించారు. 2016 అక్టోబర్ 23 న 37 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సంఖ్యాశాస్రం ప్రకారం 3 + 7 = 10, 1+0 = 1. ప్రభాస్ ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో నంబర్ వన్ గా ఉంటారు.
ఇద్దరుప్రభాస్ తన 37 ఏటనే బ్యాచలర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఒకరు ఇద్దరు కాబోతున్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం షూటింగ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే కల్యాణ ఘడియలు మొదలు కానున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లలో రెబల్ స్టార్ కృష్ణం రాజు తలమునకలై ఉన్నారు.
మూడు భాషలుబాహుబలితో ప్రభాస్ కి అన్ని భాషల్లో క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇక డార్లింగ్ చేసే ప్రతి సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. సుజీత్ దర్శకత్వంలో చేయనున్న మూవీ కూడా మూడు భాషల్లో నిర్మించేందుకు యూవీ క్రియేషన్స్ వాళ్లు సన్నాహాలు చేస్తున్నారు.
ఇండియన్ స్టార్బాహుబలి కంక్లూజన్ విడుదలైన తర్వాత నుంచి యంగ్ రెబల్ స్టార్ అనే పేరు చెరిగి పోయి ఇండియన్ స్టార్ గా మారనున్నారు. ఇప్పటికే ఇంటర్ నేషనల్ మీడియా ప్రభాస్ ని ఇండియన్ స్టార్ గా పిలుస్తోంది. ఆ గుర్తింపు స్థిరపడిపోనుంది.
నటుడిగా 15 ఏళ్లుప్రభాస్ తన 37 ఏటనే 15 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అర్ధం కాలేదా.. ? ఆయన రీల్ వయసు 15 కానుంది. యంగ్ రెబల్ స్టార్ తొలి చిత్రం ఈశ్వర్ 2002 నవంబర్ 11న రిలీజ్ అయింది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి నటుడిగా పదిహేనవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
మైనపు విగ్రహం మేడం టుస్సాడ్ వారు బ్యాంకాక్ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చిలో ఆవిష్కరించనున్నారు. అంటే ఆ గౌరవం కూడా ప్రభాస్ 37 ఏటనే దక్కనున్నదన్న మాట.
ఇలా ప్రభాస్ కి ఈ పుట్టినరోజు వెరీ వెరీ స్పెషల్ కానుంది. అంతేకాదు బాహుబలి కంక్లూజన్ లోని నటనకు దాసోహం అనేందుకు అనేక అవార్డులు రెడీగా ఉన్నాయి.