Chakram Re-Release: ఫ్లాప్ సినిమాకు రీరిలీజ్ అవసరమా అంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు (Mahesh Babu) ప్రభాస్ (Prabhas) చిరంజీవి (Chiranjeevi) బాలకృష్ణ (Nandamuri Balakrishna) , రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ లు (Jr NTR) నటించిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలను విడుదల చేయడానికి ఆయా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో డిజాస్టర్ అయినప్పటికి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న సినిమా అంటే వెంటనే చక్రం (Chakram) అని చెబుతారు. కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూనే మరోవైపు మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. జీవితం గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాన్ని కృష్ణవంశీ చక్రం సినిమా ద్వారా చెప్పారు.

హై రేంజ్ లో మాస్ ఇమేజ్ వచ్చిన తరువాత ప్రభాస్ చనిపోయే పాత్రలో నటించడం ఆడియెన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక పోస్టర్ తో చక్రం మూవీని అతి త్వరలో రీరిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. ప్రభాస్ వర్షం (Varsham) మూవీ గతంలో రీరిలీజ్ అయిన ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు.

అలాంటిది అతని డిజాస్టర్ మూవీ ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేసే అవకాశం ఉందా అంటే కష్టమనే మాట వినిపిస్తోంది. అయితే ఈ సినిమా రి రిలీజ్ అవుతుంది అంటూ వార్తలు వినిపించడంతో ప్లాప్ సినిమాకు రిలీజ్ అవసరమా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus