ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్!

‘కేజీఎఫ్’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం నాడు ఒక కీలక ప్రకటన చేసింది. తాము నిర్మించబోతున్న మరో భారీ పాన్ ఇండియా సినిమా వివరాలను డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే ఇది ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా గురించే అని అందరూ భావించారు. అందరూ ఊహించనట్లుగానే జరిగింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీనికి ‘సలార్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘సలార్’ అంటే లీడర్ అని అర్ధం వస్తుంది. ఈ ఫస్ట్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో ప్రభాస్ ఏకే 47 లాంటి పెద్ద గన్ ను పట్టుకొని కోపంగా చూస్తూ కనిపించాడు. ఈ లుక్ లో ప్రభాస్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. అతడి మీసం, లుక్ కాస్త కొత్తగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ని రిలీజ్ చేసిన యూనిట్ ‘THE MOST VIOLENT MEN.. CALLED ONE MAN.. THE MOST VIOLENT” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని బట్టి సినిమాలో ప్రభాస్ మోస్ట్ వయిలెంట్ మ్యాన్ గా సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ లో నటించబోతున్నారు. అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్‌లో నటించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాని పూర్తి చేస్తాడో లేక పూర్తయిన తరువాత చేస్తాడో చూడాలి!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus