నైట్రో స్టార్ సుధీర్ బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది ‘హంట్’, ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అయితే, ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ‘హరోం హర’ అనే మాస్ మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ‘మామ మస్చిందా’ తర్వాత మళ్ళీ ఆయన ‘హరోం హర’ అనే చిత్రాన్ని చేసాడు.
ఈ సినిమాని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ‘సెహరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని రేపు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేత విడుదల చేయించబోతున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వేదిక ని కూడా ఏర్పాటు చేశారట. టీజర్ ని లాంచ్ చేసి, ఆ సినిమా గురించి నాలుగు మాటలు కూడా మాట్లాడబోతున్నాడట ప్రభాస్. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మళ్ళీ ప్రభాస్ ని ఏ ఈవెంట్ లో కూడా చూడలేదు అభిమానులు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన సుధీర్ బాబు కోసం కనిపించబోతున్నాడు.
సలార్ ప్రొమోషన్స్ ప్రారంభం అయ్యే ముందే (Prabhas) ప్రభాస్ ని చూసే అదృష్టం కలగడం తో అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. సలార్ చిత్రం వచ్చే నెల 22 వ తారీఖున విడుదల కాబోతుంది. డిసెంబర్ 1 వ తేదీన ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు.