సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాల్లో… ఎక్కువ శాతం కంటెంట్ కంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందే సినిమాలే విజయం సాధిస్తాయి. కామెడీ లేకుండా కంటెంట్ తో రూపొందే సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా.. లాభం ఉండదు. ఈ 2026 సంక్రాంతితో అది మరోసారి రూపొందింది.
ఈ సంక్రాంతికి 5 సినిమాలు బరిలో దిగాయి. అవే ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’.

రిలీజ్ కి ముందు ఈ సినిమాల్లో ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అంటే డౌట్ లేకుండా ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఉండేది. కానీ రిలీజ్ తర్వాత అది లాస్ట్ ఛాయిస్ అయిపోయింది. ఫస్ట్ ఛాయిస్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెకండ్ ఛాయిస్ ‘నారీ నారీ నడుమ మురారి’, థర్డ్ ఛాయిస్ ‘అనగనగా ఒక రాజు’, ఫోర్త్ ఛాయిస్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అయ్యాయి.’ది రాజాసాబ్’ లో కంటెంట్ ఉంది. కానీ అది సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు.
ముందుగా ప్రకటించినట్టు డిసెంబర్ 5న చేసి ఉండాల్సింది. ప్రభాస్ కి రిలీజ్ టైం వంటి వాటిపై ఫోకస్ ఉండదు. కానీ చిరు అలా కాదు.. ఆయనకు ఏ సీజన్లో ఏ సినిమా వర్కౌట్ అవుతుందో బాగా తెలుసు. అందుకే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కోసం ‘విశ్వంభర'(Vishwambhara) ని వాయిదా వేసుకున్నారు.’మన శంకర వర ప్రసాద్ గారు’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒకవేళ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్లేస్ లో ‘విశ్వంభర’ వచ్చి ఉంటే.. ఫలితం ఎలా ఉంటుందో చిరుకి తెలుసు.
గతంలో ‘అంజి’తో ఆయనకి గొప్ప అనుభవమే ఉంది. అందుకే ఈ సంక్రాంతికి ‘విశ్వంభర’ బదులు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ని దించి ఎస్కేప్ అయ్యాడు.మరోపక్క బదులు ‘ది రాజాసాబ్’ దొరికేశాడు.
