‘సలార్’ రిలీజ్ టైంలో ప్రభాస్ తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అనే దానిపై కొన్ని కామెంట్స్ చేశాడు. అవి హాట్ టాపిక్ అయ్యాయి. తన 21 ఏళ్లలో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేయలేదని,తనకి ఫేవరెట్ డైరెక్టర్ అతనే అని కామెంట్స్ చేశాడు. ఇది రాజమౌళి అభిమానులను హర్ట్ చేశాయి. ఎందుకంటే.. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలబెట్టిందే రాజమౌళి. ‘బాహుబలి’ ‘బాహుబలి 2 ‘ సినిమాల వల్లే ప్రభాస్ కి వరల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది.
అతని మార్కెట్ కూడా 10 రెట్లు పెరిగింది. ఇప్పుడు అతని పై రూ.500 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు వస్తున్నారు అంటే కారణం అదే. అలాంటి రాజమౌళిని వదిలేసి ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ డైరెక్టర్ అనడం ఏంటి అనేది కేవలం రాజమౌళిని అభిమానించేవారు మాత్రమే కాదు.. ప్రభాస్ ను అభిమానించే వారికి కూడా అర్ధం కాని విషయం.సరే ప్రభాస్ కామెంట్స్ ని జనాలు అంతగా సీరియస్ గా తీసుకోలేదు.
అంతా అయిపోయింది అనుకుంటున్న ఈ టైంలో మళ్ళీ (Prabhas) ప్రభాస్ .. ఆ విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ప్రభాస్ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించాడు. అందులో ప్రభాస్ మాట్లాడుతూ.. “నా 21 ఏళ్ళ సినీ కెరీర్లో ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ ను చూడలేదు. నాకు చాలా ఇష్టమైన, కంఫర్టబుల్ డైరెక్టర్ అని చెప్పాలి. నాకు ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్. వినాయక్ గారు కూడా నాకు కంఫర్టబుల్ డైరెక్టర్. కాకపోతే ఆయనతో 6 నెలలే పనిచేశాను. ‘సలార్’ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నా పైగా పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి..
ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సెట్స్ లో అతను చాలా కంఫర్ట్ ఇస్తాడు.. షూట్ అయిపోయాక నవ్విస్తాడు, ఎంతగానో ప్రేమిస్తాడు. ప్రశాంత్ నీల్ కి యాక్టర్స్ అంటే దేవుళ్ళతో సమానం” అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి సెట్స్ లో బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు. చాలా మంది అతన్ని పని మూర్ఖుడు అంటారు. ప్రభాస్ నిజ జీవితంలో చాలా బద్ధకస్తుడు అంటారు. బహుశా అందుకే రాజమౌళి అంటే ప్రభాస్ కి.. ప్రశాంత్ నీల్ అంత ఇష్టం లేదేమో.
#PrashanthNeel is my most favourite , comfortable director in My 21 years of career. – #Prabhas #Salaar pic.twitter.com/xEWJGmyXvE
— Prabhas Trends (@TrendsPrabhas) January 17, 2024
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!