Prabhas: ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ కు ఆయన హామీ ఇచ్చారా?

ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ టీజర్ విషయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ రావడం ప్రభాస్ ను, ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. ముఖ్యంగా ఆదిపురుష్ టీజర్ లోని విజువల్ ఎఫెక్స్ట్ పై ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే సీజీ వర్క్ క్వాలిటీతో ఉండాలని సినిమా విడుదలైన తర్వాత

ఎలాంటి నెగిటివ్ కామెంట్లు వినిపించకూడదని ప్రభాస్ ఆదిపురుష్ మేకర్స్ కు సూచనలు చేశారని తెలుస్తోంది. దర్శకుడు ఓం రౌత్ ను సైతం ప్రభాస్ ఇందుకు సంబంధించి హెచ్చరించారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని టెన్షన్ పడవద్దని ప్రభాస్ కు చెప్పినట్టు సమాచారం.సీజీ వర్క్ పర్ఫెక్ట్ క్వాలిటీతో ఉండాలని ప్రభాస్ సూచనలు చేశారని బోగట్టా. ఆదిపురుష్ తెలుగు వెర్షన్ హక్కులను తీసుకోవాలని మొదట యూవీ క్రియేషన్స్ నిర్మాతలు భావించారు.

అయితే ట్రోలింగ్ వల్ల ఆ విషయంలో యూవీ నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు యూవీ క్రియేషన్స్ కు ఇప్పటికే భారీ షాకిచ్చాయి. ఆదిపురుష్ మూవీ ట్రైలర్ తోనే ఈ సినిమా రిజల్ట్ గురించి క్లారిటీ వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో నిర్మాతలు సైతం టెన్షన్ పడుతున్నారు. ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus