Prabhas: ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రభాస్ క్రేజ్ చూస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు (Prabhas) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ప్రభాస్ కు కెరీర్ పరంగా ఎంతగానో కలిస్తోంది. ప్రభాస్ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా కల్కి మూవీ వచ్చే నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. సాన్ డియోగో కామిక్ కాన్ వేదికగా కల్కి మూవీ టీజర్ విడుదలైంది.

అక్కడ టీజర్ విడుదలైన తొలి భారతీయ మూవీగా కల్కి (Kalki) నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీ టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా విడుదల కానుందని తెలుస్తోంది. కల్కి, కన్నప్పతో (Kalki) ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రభాస్ ట్రెండ్ క్రియేట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్న ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని అరుదైన రికార్డ్స్ తో సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ మన దేశంలోనే అతి పెద్ద స్టార్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ ఇతర భాషల్లో సైతం పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఫ్యాన్స్ ను సైతం అంతకంతకూ ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నా దర్శకనిర్మాతలు ప్రభాస్ కోరిన స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రభాస్ మాత్రమే టాలీవుడ్ నుంచి ఈ స్థాయికి చేరుకున్న హీరో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus