Prabhas: ‘డార్లింగ్’ కు 11 ఏళ్ళు..ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎ.కరుణాకరన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘డార్లింగ్’. 2010వ సంవత్సరం ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదలయ్యింది. ‘ఛత్రపతి’ తరువాత ఓ హిట్టు కోసం ప్రభాస్ మరియు అతని అభిమానులు ఎదురు చూస్తున్న రోజులవి. అలాంటి టైములో ‘డార్లింగ్’ వచ్చింది. తన మాస్ ఇమేజ్ ను, ఫాలోయింగ్ ను పక్కన పెట్టి ప్రభాస్ ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేసాడు. మొదటి షోతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది ఈ చిత్రం. ప్రభాస్ ప్లాప్ లకు బ్రేక్ వేసి అతనికి మంచి కం-బ్యాక్ ను ఇచ్చింది ‘డార్లింగ్’.

ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కెయ్యండి :

నైజాం  6.23 cr
సీడెడ్  2.21 cr
ఉత్తరాంధ్ర  3.65 cr
ఈస్ట్  2.14 cr
వెస్ట్  2.65 cr
గుంటూరు  2.06 cr
కృష్ణా  2.41 cr
నెల్లూరు  1.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   0.47 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  22.91 cr

‘డార్లింగ్’ చిత్రానికి రూ.16.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 22.91 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్స్ కు 6.11 లాభాలను మిగిల్చిందన్న మాట. 5 ఏళ్ల తరువాత ప్రభాస్ కు దక్కిన హిట్ ఇది..!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus