సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రభాస్ డైరెక్టర్

సుశాంత్ సూసైడ్ మిస్టరీ తరవాత బాలీవుడ్‌లో నేపోటిజం డిబేట్లు, డిస్కషన్లు హాట్ హాట్‌గా మారాయి. స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చే పిల్లలకు, వారసులకు స్టార్స్ సపోర్ట్ ఉండడం వల్లే రాణించగలుగుతున్నారని ఏ నేపథ్యం లేకుండా వచ్చిన స్టార్‌గా ఎదిగిన కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు కొందరు విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. ఈ టైమ్‌లో డైరెక్టర్లకు స్టార్ సపోర్ట్ 100 పర్సెంట్ అవసరమే అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘ఆదిపురుష్’ చేయనున్న ఓమ్ రౌత్ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

‘ఆదిపురుష్’ కంటే ముందు బాలీవుడ్ సినిమా ‘తానాజీ’కి ఓమ్ రౌత్ డైరెక్షన్ చేశారు. అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్ ఆ సినిమాలో యాక్ట్ చేశారు. నెక్స్ట్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చెయ్యనున్నారు. స్టార్ హీరోల సపోర్ట్ లభించడం తన అదృష్టమని అతడు అంటున్నాడు. డైరెక్టర్లకు స్టార్ సపోర్ట్ అవసరం అంటున్నాడు. “బిగ్ స్టార్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది డైరెక్టర్‌ను చేస్తుంది. లేదా డైరెక్టర్ కాకుండా చేస్తుంది. కొత్త డైరెక్టర్లకు మాత్రమే కాదు, ఎవరికైనా స్టార్ సపోర్ట్ అవసరం.

ఫ్రీడమ్ కావాలి. ఫ్యూచర్‌లో నేను ప్రొడ్యూసర్ అయితే డైరెక్టర్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. నా కెరీర్ బిగినింగ్‌లో బిగ్గెస్ట్ స్టార్స్ అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్ నాకు సపోర్ట్ ఇవ్వడం నా లక్కీ. దేవగణ్ నాపై నమ్మకం ఉంచకపోతే ‘తానాజీ’ ఉండేది కాదు. ప్రభాస్ సపోర్ట్ లేకుండా ‘ఆదిపురుష్’ను ఊహించలేం. వాళ్ళ వల్ల నా లైఫ్‌లో ఇవన్నీ జరుగుతున్నాయి” అని ఓమ్ రౌత్ అన్నారు. జనవరి నుండి ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఆయన తెలిపారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus