సాహోలో ప్రభాస్ క్యారక్టర్ ని కొత్తగా డిజైన్ చేసిన సుజీత్
- July 15, 2017 / 10:38 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని షాట్స్ తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని ముంబై లో ప్రారంభించనున్నారు. అందు కోసం ప్రభాస్ చేత రిహార్సల్స్ చేయించే పనిలో డైరక్టర్ సుజీత్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది.
ఇందులో ప్రభాస్ పాత్రతో పాటు విలన్ క్యారక్టర్ ను డైరక్టర్ చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. హీరో విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్ గా ఉంటాయని తెలిసింది. అదే కథలో హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతున్నప్పటికీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















