ఎంత క్రేజ్ ఉంటే మాత్రం.. అలాంటి డెసిషన్ అవసరమా డార్లింగ్..!

‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ‘సాహో’ ఆసించిన స్థాయిలో లేకపోయినప్పటికీ భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా ఈ చిత్రం ఒక్క బాలీవుడ్ లోనే 125 కోట్ల పైనే వసూల్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటనేది బాక్సాఫీస్ కు రుచి చూపించింది. ఇప్పుడు ప్రభాస్.. బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నాడు. మంచిదే..! ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘జాన్’ అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్(కె.జి.ఎఫ్ డైరెక్టర్), పరుశురాం(బుజ్జి), సురేందర్ రెడ్డి వంటి టాప్ డైరెక్టర్లతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త ప్రభాస్ అభిమానులను తెగ టెన్షన్ పెడుతుంది. అదేంటి అంటే.. ప్రభాస్ బాలీవుడ్ లో ఓ స్ట్రెయిట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మార్కెట్ పెరిగింది కదా అని బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఎలా… అని తెలుగు సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా అంటూ రాంచరణ్ ‘తుఫాన్’ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ దెబ్బ నుండీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒక్క చరణ్ మాత్రమే కాదు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారు కూడా హిందీలో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ రిస్క్ చెయ్యాలా? అందులోనూ ‘సాహో’ సినిమాలో కూడా ఎక్కువగా బాలీవుడ్ ఛాయలే కనిపిస్తాయి. ఈకారణంగానే తెలుగు ప్రేక్షకులు ‘సాహో’ సినిమాని తిప్పి కొట్టారు అనే కామెంట్స్ కూడా వినిపించిన సంగతి తెలిసిందే. సో ప్రభాస్ బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్ని కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్ అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus