దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలతో పాటు మేకింగ్ వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. అందులో జక్కన్న నటించి వివరించే షాట్స్ చూస్తుంటే, ఆర్టిస్టులకి ప్రతి డైలాగ్ నటించి వివరిస్తారేమో .. అనే అనుమానం వస్తుంది. ఆ విషయాన్నీ జక్కన్నని అడగగా.. అందుకు ఆయన అసలు విషయం చెప్పారు. “అందరి ఆర్టిస్టులని ఒకే మాదిరిగా అంచనా వేయలేము.. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చెప్పాలి. అనుష్క ఒకసారి నటించి చూపించమని చెబుతుంది. అదే రమ్యకృష్ణ కి ఆరోజు సీన్, డైలాగ్ చెబితే చాలు .. క్యారక్టర్ లోకి వెళ్ళిపోతుంది” అంటూ వివరించారు. మరి ప్రభాస్ కి ఏవిధంగా చెబుతుంటారు? అని జక్కన్నను ప్రశ్నించగా .. ప్రభాస్ కి నటనలో స్పూన్ ఫీడింగ్ అవసరం లేదని సమాధానమిచ్చారు.
“ప్రభాస్ కి అప్పుడు ఏ సీన్ చేస్తున్నాం.. ఇంతక ముందు సీన్ ఏమి జరిగింది.. దీని తర్వాత ఏ సీన్ ఉంటుంది.. అనే బేసెమెంట్ క్లియర్ గా చెబితే చాలు. ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా నటించాలని, అలా ఫైట్ చేయాలి అని నటించి చూపించనవసరం లేదు” అని దర్శకధీరుడు చెప్పారు. డార్లింగ్ అంత మంచి నటుడు కాబట్టే అంతర్జాతీయ స్థాయి ప్రాజక్ట్ బాహుబలిని ఆయన చేతుల్లో పెట్టారు. అంకితభావంతో పనిచేసి జక్కన్న నమ్మకాన్ని ప్రభాస్ నిలబెట్టారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.