హద్దులు దాటిన అభిమానం… ప్రాణాలను బలిగొందిగా!

సాధారణంగా హీరోల అభిమానుల మధ్య గొడవలు పోట్లాట ఉండడం సర్వసాధారణం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అనే భావనలో అభిమానులు ఉంటారు. అయితే ఇలా హీరోలా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హీరోల విషయంలో పెద్ద ఎత్తున గొడవ పడడం మనం చూస్తుంటాము. అయితే అభిమానుల మధ్య ఉన్నటువంటి ఈ గొడవలు హద్దులు దాటాయని తెలుస్తోంది. ఏకంగా ప్రాణాలను తీసుకునేలా హీరోలపై అభిమానం తారా స్థాయికి చేరిందని చెప్పాలి.

ఇలా ఇద్దరు హీరోలు అభిమానుల మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో చోటు చేసుకుంది.ఏలూరుకి చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్ వేయడం కోసం వెళ్లారు. అయితే ఇలా పెయింటింగ్ వేస్తున్నటువంటి వీరిద్దరు కూడా ఒకరు పవన్ కళ్యాణ్ అభిమాని కాగా మరొకరు ప్రభాస్ అభిమాని. ఇందులో హరికుమార్ అనే వ్యక్తి ప్రభాస్ అభిమాని కాగా కిషోర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమాని.

హరికుమార్ ప్రభాస్ పై ఉన్న ఇష్టంతో తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. అది చూసిన కిషోర్ తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, తను కూడా ప్రభాస్ స్టేటస్ తొలగించి పవన్ స్టేటస్ పెట్టాలని సూచించారు. అయితే హరికుమార్ తాను తొలగించే ప్రసక్తి లేదని తాను ప్రభాస్ కి పిచ్చి ఫ్యాన్ అంటూ తెలిపారు. ఇలా వీరిద్దరి మధ్య వాట్సప్ స్టేటస్ గురించి పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకుంది.

ఇలా ఈ గొడవ పెరిగి పెద్దది కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హరికుమార్ ఏకంగా కిషోర్ పై సెంట్రింగ్ కర్రతో బాదాడు. అంతేకాకుండా సిమెంట్ రాయితో ముఖం మీద బలంగా కొట్టాడు. ఇలా హరి కుమార్ కిషోర్ పై దాడి చేయడంతో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో హరికుమార్ అక్కడి నుంచి పరారయిపోగా పోలీసుల కేసు దర్యాప్తు తీసుకొని నిందితుడి కోసం వెతుకుతున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus