Prabhas: ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో మేకర్స్ నుంచి స్పష్టత రావడం లేదు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా కనీసం ఈ సినిమా మేకర్స్ నుంచి ఎటువంటి అప్ డేట్ లేదు. ఒకవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రమోషన్స్ చేస్తూ ఆ సినిమాపై అంచనాలు పెంచుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం రాధేశ్యామ్ విషయంలో నిరాశ తప్పడం లేదు. అయితే ప్రభాస్ ఇతర సినిమాల అప్ డేట్స్ మాత్రం వస్తున్నాయి.

అక్టోబర్ కు రిలీజయ్యే ఆర్ఆర్ఆర్ సినిమాకు మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా కనీసం త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తామని రాధేశ్యామ్ మేకర్స్ నుంచి ప్రకటన వస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేస్తే సినిమా సక్సెస్ కావడం కష్టమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది.

ప్రభాస్ ప్రమోషన్స్ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే సంగతి తెలియాల్సి ఉంది. అప్ డేట్స్ వస్తే యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళిని చూసి నేర్చుకోండంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతుండటం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus