ప్రభాస్ ఫ్యాన్స్ కి సిద్ధార్ధ్ కి మొదలైన మాటల యుద్ధం!

మన గురించి నలుగురూ మాట్లాడుకోవాలి… అది మంచి అయినా.. చెడు అయిన ఫరవాలేదు… అని ఆలోచించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఫేడ్ అవుట్ అవుతున్న స్టార్స్ ఈ దారినే ఎంచుకుంటున్నారు. బాగా క్రేజ్ ఉన్న హీరో ఫ్యాన్స్ కి కెలికితే ఉచితంగానే మీడియాలో ట్రోల్ అవుతామని ఫిక్స్ అవుతున్నారు. తాజాగా సిద్ధార్ధ్ ఇదే బాటలోకి వచ్చారు. అసలు వివాదాలంటే ఆమడ దూరంలో ఉండే ప్రభాస్ పై కౌంటర్ వేసి అతని అభిమానులను రెచ్చగొట్టారు. వివరాల్లోకి వెళితే… తమిళ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా, ప్రభాస్‌ పుట్టిన రోజుకు మరో వంద రోజులు సమయముందంటూ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్‌ నెక్ట్స్ పుట్టిన రోజుకు 465 రోజులు ఉందంటూ కామెంట్‌ చేశాడు. అంతేకాదు హ్యాష్ ట్యాగ్ ని ఇలాంటి వాటికీ ఉపయోగించవద్దని హితవు పలికారు.

సిద్ధార్థ్‌ చేసిన కామెంట్  వెటకారంగా ఉందని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. కొంత మంది గంతలో ప్రభాస్‌, సిద్ధు కలిసి దిగిన ఫోటోను సిద్ధార్థ్‌కు ట్యాగ్ చేస్తూ “ఎందుకు భయ్యా నీ ఫ్రెండే కదా..” అని అడగగా.. “అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే ఫ్రీడం తీసుకున్నా. డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని. ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కద భయ్యా?” అంటూ రిప్లై ఇచ్చాడు. “అయితే తమిళ హీరోలు అజయ్, విజయ్ గురించి జోకులు వేయి చూద్దాం” అని ఫ్యాన్స్ చురకలు అంటించారు.  “టాలీవుడ్‌ హీరోల  ఫ్యాన్స్‌ జోలికి వస్తే  చుక్కలు చూపించాల్సి వస్తుంది” అంటూ హెచ్చరించారు. ఇలా మాటకు మాటకు పెరిగి వివాదం పెద్దది అవుతోంది. మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus