Prabhas: ప్రభాస్‌ బర్త్‌డే వీక్‌.. ఎన్ని సర్‌ప్రైజ్‌!

అభిమానులకు తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు మించిన ఆనందమైన రోజు ఇంకొకటి ఉండదు. కారణం.. ఆ రోజు ఆ హీరోకు సంబంధించిన అనేక అప్‌డేట్లు వస్తాయి. అందులో వరుస సినిమాలు చేస్తూ, ఒకేసారి మల్టిపుల్ మూవీస్‌ చేసే హీరోల అభిమానులకైతే ఆ ఆనందం డబుల్‌, ట్రిపుల్‌ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానులు కూడా ఇంచుమించు ఇలాంటి ఆనందన్నే పొందనున్నారు. కారణం త్వరలో ప్రభాస్‌ పుట్టిన రోజు రానుండటమే.

అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ప్రభాస్‌ బర్త్‌డే పార్టీలు, ఫంక్షన్లు లాంటివి ఉండవు.కానీ సినిమాల అప్‌డేట్లు మాత్రం భారీగా ఉంటాయి అని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్‌ ప్రస్తుతం అన్ని సినిమాలతో టై అప్‌ అయ్యి ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఏడాది ప్రభాస్‌ బర్త్‌డేకి ఏయే అప్‌డేట్స్‌ రావొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది ఓసారి చూద్దాం.

* ప్రభాస్‌ చేతిలో ఇప్పుడున్న సినిమాలు చూస్తే.. ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ సెట్స్‌ మీద ఉన్నాయి. ఈ రెండూ కాకుండా ‘స్పిరిట్‌’, ‘రాజా డీలక్స్‌’ (సినిమా టైటిల్‌ పరిశీలనలో ఉంది) చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన అప్‌డేట్స్‌ రావొచ్చని తెలుస్తోంది.

* ముందుగా ప్రభాస్‌ – మారుతి సినిమా గురించి చూస్తే.. ఈ సినిమా లుక్‌ టెస్ట్‌ కోసం ఇటీవల ఫొటో షూట్‌ చేశారు. అందులో ఒకటి ఓకే అనుకున్నారట. పుట్టిన రోజు సందర్భంగా ఆ లుక్‌ వస్తుంది అంటున్నారు. అందులో ప్రభాస్‌ కూల్‌ న్యూ లుక్‌లో ఉంటాడట.

* ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ వస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ వల్ల టీమ్‌కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ట్రోలింగ్స్‌, నెగిటివిటీ బాగా ఎక్కువయ్యాయి. దీన్ని కవర్‌ చేయడానికి కొత్త లుక్‌ స్టిల్‌ రిలీజ్‌ చేస్తారు అని టాక్‌.

* ‘సలార్‌’ సినిమా నుండి అధికారికంగా వచ్చిన స్టిల్స్‌ కంటే.. అనధికారికంగా వచ్చిన వివరాలే ఎక్కువ. లీకుల బెడద ఈ సినిమాకు ఎక్కువగా ఉంది. పుట్టిన రోజునాడు కూడా లీకులు ఎందుకు అని అనుకుంటున్నారో ఏమో.. సరికొత్త స్టిల్‌ను రిలీజ్‌ చేస్తున్నారట. ఇందులో ప్రభాస్‌ ఫుల్‌ కటౌట్‌ చూడొచ్చు అని సమాచారం.

* ఈ సినిమాలు కాకుండా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ తొలిసారి పోలీసుగా కనిపిస్తాడని టాక్‌. అయితే ఈ సినిమా నుండి విషెష్‌ పోస్టర్‌ తప్ప.. లుక్‌ వచ్చే అవకాశం లేదు అంటున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus