Prabhas: నీ కటౌట్ అలాంటిది అన్నా.. ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రభాస్ అందగాడు అనే సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా ప్రభాస్ సినిమా సినిమాకు మరింత అందంగా కనిపిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా ఐదు సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ కొత్త లుక్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రభాస్ అభిమానులు దిష్టి తీయించుకో ప్రభాస్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రభాస్ ను ఎలా చూడాలని అనుకుంటున్నామో ఫోటోలలో ప్రభాస్ అలానే ఉన్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. నీ కటౌట్ అలాంటిది అన్నా.. ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్నావని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ లుక్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ తర్వాత సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రభాస్ సలార్ సినిమాతో రికార్డులు బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫ్యాన్స్ అంచనాలకు మించి తర్వాత ప్రాజెక్ట్ లు ఉండేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమా కంటే ఈ సినిమాపైనే అంచనాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. సలార్ మూవీ సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా హక్కుల కోసం భారీగా డిమాండ్ నెలకొంది.

బిజినెస్ లెక్కల విషయంలో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కొంతమంది చెబుతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus