ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆ విషయంలో హర్ట్ అయ్యారట..!

మొన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు అంతా పెద్ద ఎత్తున ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ లతో ఇండియన్ లెవెల్లో ప్రభాస్ పేరు సోషల్ మీడియా అంతా మారుమోగింది. అంతా బానే ఉంది కానీ.. ప్రభాస్ అభిమానులు ఒక్క విషయంలో మాత్రం బాగా హర్ట్ అయ్యారట. విషయం ఏంటంటే.. ప్రభాస్.. ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టైటిల్ తో పాటు ఈ చిత్రం నుండీ ప్రభాస్ లుక్ ఒకటి విడుదల చేస్తారు అనుకుంటే.. నిర్మాతలు ‘యూవీ క్రియేషన్స్’ వారు అలాంటిది ఏమీ చేయలేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ ల కోసం గత ఐదేళ్ళ నుండీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇలాగే పడిగాపులు కాస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అంతేనేమో..!

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus