ప్రభాస్ గురించి రాసేటప్పుడు అతని స్టార్ డమ్ గురించి, పాన్ ఇండియా ఇమేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఎందుకంటే దేశంలోని స్టార్ హీరోల్లో అతని స్థానం అంత ఎత్తున ఉంది. అలాంటి హీరోలకు ఫ్లాప్‌లు రావడం తప్పు కాదు. ఎందుకంటే సినిమా అనుకున్నది అనుకున్నట్లు తెర మీదకు రావాలని లేదు. దీంతో లెక్క తప్పి సినిమా తుస్ మంటుంది. ఆ సినిమా ఫలితం నుండి ఎంత త్వరగా బయటకు వచ్చి మరో హిట్ కొడదామా అని ఆ హీరో అనుకుంటాడు. ఫ్యాన్స్ కూడా అలానే అనుకుంటారు.
అయితే ‘ఆదిపురుష్’ టీమ్ ఈ ఆలోచన లేకుండా చేస్తోంది. అది సినిమా హిట్ చేసో, లేక భారీ వసూళ్లు అందించి చేస్తోంది కాదు. ఆ మాటకొస్తే ఆ ఆలోచన స్థానంలో ‘మాకేంటిది’ అనే ఫీలింగ్ కలిగిస్తోంది. కావాలంటే మీరే చూడండి ప్రభాస్ సినిమాకు కుర్ర హీరోలు, చిన్న హీరోల సినిమాలకు ఇచ్చినట్లుగా వన్ ప్లస్ వన్ ఆఫర్లు, తగ్గింపు ధరలు అంటూ వారానికో ఆఫర్ తీసుకొస్తున్నారు. ఇవి అభిమానులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతోంది.
ఏదైనా కొత్త వస్తువుకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గినప్పుడు డిస్కౌంట్లు ఇస్తుంటారు. మన దగ్గర అయితే ఓ వారం సినిమా టికెట్ రేట్లు పెంచి.. ఆ తర్వాత తగ్గించి సాధారణ ధరలకు ఇస్తారు. అయితే బాలీవుడ్‌లో టికెట్ ధరలను సాధారణ ధరల కంటే ఇంకా తగ్గిస్తున్నారు. రూ. 150, రూ. 112 అంటూ బాగా తగ్గించేస్తున్నారు. దీని వల్ల టికెట్లు తెగుతాయో లేదో తెలియదు కానీ.. (Prabhas) ప్రభాస్ ఇమేజ్‌ను మాత్రం బాగా తగ్గిస్తున్నారు అని అంటున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ స్కీమ్‌లు ఏవీ తెలుగు రాష్ట్రాల్లో లేవు. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఇస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజిలో ప్రభాస్ ఇమేజీని డ్యామేజీ చేస్తున్నారు అనే వాదనకు బలం చేకూరుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు రూ. 500 కోట్ల వసూళ్లకు చేరువగా ఉంది. ఇందులో అధిక శాతం తొలి మూడు రోజుల్లోనే వచ్చేశాయి అని గుర్తుంచుకోవాలి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!