కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంటుంది అనే సంగతి తెలిసిందే. అతని లేటెస్ట్ మూవీ ‘లియో’ తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ‘విక్రమ్’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన లోకేష్ కనగరాజ్.. ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో అంచనాలు ఇంకా పీక్స్ కి వెళ్లాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి అని చెప్పాలి. అయితే టాక్ మాత్రం అనుకున్నట్టు రాలేదు.
లోకేష్ కనగరాజ్ – విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ మూవీ నెగిటివ్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని అంతా అనుకున్నారు. అయితే ఆ అద్భుతాలు మార్నింగ్ షోల వరకు మాత్రమే పరిమితమైనట్టు కనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే మ్యాట్నీల నుండి ‘లియో’ ఆఫ్ లైన్ బుకింగ్స్ తగ్గాయి. అది పక్కన పెడితే ఈ సినిమా ఫలితం కోసం అందరికంటే ఎక్కువగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూశారు.
అయితే నెగిటివ్ టాక్ వస్తుండటంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ .. ప్రభాస్ తో ఓ సినిమా చేస్తాను అని కన్ఫర్మ్ చేశాడు. అది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదని, చాలా కొత్తగా ఆ సబ్జెక్ట్ ని డిజైన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. కానీ ‘లియో’ చూసిన తర్వాత లోకేష్ – ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ మూవీ గురించి వారిలో అసంతృప్తి ఏర్పడినట్టు తెలుస్తుంది.