Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో పడేశారు.. ఏమైందంటే..!

తేజ సజ్జ (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిరాయ్'(Mirai). ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హనుమాన్’ (Hanu-Man)  తర్వాత తేజ సజ్జ నుండి వస్తున్న మూవీ కావడంతో దీనిపై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అశోకుడి 9 పుస్తకాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ ఇది.

Prabhas

‘ఈగల్’ (Eagle) కంటే ముందే మొదలైంది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల లేట్ అవుతూ వచ్చింది. అయితే మొత్తానికి 2025 ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వడం లేదు అని భావించి ‘మిరాయ్’ ని ఆగస్టు 1కి వాయిదా వేశారు. ఈరోజు దానిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ దానికంటే ముందుగా వస్తుంది అని ప్రకటించిన ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  సంగతేంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ ను కూడా ‘పీపుల్ మీడియా’ వారే నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఆ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ ప్రకటించారు. కానీ రిలీజ్ టైం దగ్గరపడుతోంది. షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ నిర్మాతలు రిలీజ్ డేట్ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మే 22న వస్తుంది అని కొందరు, దసరాకి వస్తుంది అని మరికొందరు.. చెబుతున్నారు. కానీ ‘ది రాజాసాబ్’ మేకర్స్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.

‘విశ్వంభర’ టీం ఆలోచన సరైనదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus