Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను ఆ స్టార్ డైరెక్టర్ పట్టించుకుంటారా?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా గురించి చాలా సందర్భాల్లో వార్తలు వినిపించినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా స్కోప్ ఉంది.

Prabhas

అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ అభిమానుల రిక్వెస్ట్ ను హను రాఘవపూడి పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎంపిక ఇప్పటికే పూర్తైందని ఆ వివరాలను ప్రకటించడం మాత్రమే మిగిలిందని తెలుస్తోంది.

ప్రభాస్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండగా ప్రభాస్ ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి. సలార్  (Salaar)   , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఇమేజ్, రేంజ్ ను ఎంతో పెంచాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

ప్రభాస్ ది రాజాసాబ్ (The Rajasaab)  సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ది రాజాసాబ్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతుండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తమిళమే అంత చక్కగా మాట్లాడితే.. తెలుగు సంగతేంటో.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus