Shruti Hassan: ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న శృతిహాసన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ శృతి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు శృతిహాసన్ తెలుగులో నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.

ఆ సినిమా తరువాత పవన్, శృతి కాంబినేషన్ లో తెరకెక్కిన కాటమరాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలవగా ఈ సినిమాలోని శృతి పాత్ర, నటనపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ సినిమా తరువాత కొన్నేళ్లు తెలుగు తెరకు దూరమైన శృతి హాసన్ వరుస ఆఫర్లతో మళ్లీ బిజీ అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన క్రాక్ సినిమాతో శృతి హాసన్ హిట్ అందుకున్నారు. అయితే క్రాక్ సినిమాతో శృతి హాసన్ హిట్ సాధించినా ఆ సినిమాకు శృతి పాత్ర ప్లస్ కాలేకపోయింది.

ఈరోజు విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతి పాత్ర తేలిపోయింది. శృతి పాత్ర సినిమాలో లేకపోతే సినిమా మరింత బాగుండేదని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రిటిక్స్ సినిమాలో శృతి పాత్ర, నటన బాలేదంటూ అభిప్రాయపడుతున్నారు. శృతి పాత్రపై వ్యక్తమవుతున్న విమర్శల వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సలార్ సినిమాలో శృతిహాసన్ పుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తూ ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. సలార్ సినిమాలో కూడా శృతిహాసన్ నటనతో మెప్పించలేకపోతే మాత్రం ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని చెప్పవచ్చు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus