మెగాస్టార్ కంటే ప్రభాస్ గొప్ప అని ట్వీట్లు, దానికి మెగా ఫ్యాన్స్ రీటార్ట్లు

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తిట్టుకొన్నారంటే ఒక అర్ధం ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్ లైన్ లో కొట్టుకొన్నారంటే ఒక లాజిక్ ఉంది. సదరు గొడవల్లో రీజన్స్ సిల్లీ అయినా.. ఎమోషన్స్ ను మాత్రం ఎవరూ కాదనలేరు. కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు చిరంజీవిని క్రిటిసైజ్ చేస్తూ,, ట్రోల్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. నిజానికి “సైరా” ప్రమోషన్స్ లో ఒకటికి పదిసార్లు చిరంజీవి ఈ సినిమా మేము ఇంత భారీగా తీయడానికి స్పూర్తి ఇచ్చిన సినిమా “బాహుబలి” అని చెబుతూనే ఉన్నాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా రాజమౌళి విజయాన్ని చూసి మేము ఎప్పుడూ కుళ్లుకోలేదు అని చెప్పాడు కూడా.

కానీ.. కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని మరీ దారుణంగా ట్రోల్ చేయడమే కాదు.. మరీ అసభ్య పదజాలంతో ఆయన్ని తూలనాడుతున్నారు. “సైరా” హిట్ అవ్వడమే కాదు.. బాహుబలి తర్వాత తెలుగు నుంచి వంద కోట్ల షేర్ వసూలు చేసిన ఏకైక చిత్రంగా నిలిచింది. అయినా కూడా సైరాను ఫ్లాప్ అని ఎందుకు పదే పదే పేర్కొంటూ గోల చేస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. మరీ ముఖ్యంగా ప్రభాస్ నెం.1 అని చిరంజీవి ఇంకా ఎక్కడో ఆగిపోయాడని కామెంట్ చేయడం మాత్రం బాగోలేదు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus