Prabhas: తండ్రి అంటే ప్రభాస్ కు అంత గౌరవమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్. బాహుబలి సిరీస్ సినిమాల వల్ల ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై భారీగా అంచనాలు పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ మరికొన్ని ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ స్టార్ హీరోకు ఇండస్ట్రీలో మృదు స్వభావి మరియు మొహమాటస్తుడు అనే పేరు కూడా ఉంది.

ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను ప్రభాస్ కు సన్నిహితుడు కాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను ప్రభాస్ మొహమాటం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అడవిరాముడు సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ముద్దు సన్నివేశంలో నటించాల్సి ఉండగా ఆ సీన్ చేయడం కొరకు తండ్రికి ప్రభాస్ ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

తండ్రి అనుమతి ఇచ్చిన తరువాతే ప్రభాస్ ఆ సన్నివేశంలో నటించాడని ప్రభాస్ శ్రీను తెలిపారు. తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న ప్రభాస్ సీన్ లో నటించడం కొరకు తండ్రి అనుమతి అడగటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus