Prabhas: రాధేశ్యామ్ ఫస్ట్ కాపీ చూసిన ప్రభాస్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న క్లాస్ మూవీ రాధేశ్యామ్ కావడం గమనార్హం.

పునర్జన్మల కథాంశంతో రాధేశ్యామ్ మూవీ తెరకెక్కగా ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి తాజాగా రాధేశ్యామ్ ఫస్ట్ కాపీని చూశారని బోగట్టా. పూజా హెగ్డే కూడా తన కుటుంబంతో కలిసి రాధేశ్యామ్ ఫస్ట్ కాపీని చూశారని సమాచారం. సినిమా చూసిన తర్వాత ప్రభాస్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాకు సముద్రంలో తీసిన 12 నిమిషాల ఎపిసోడ్ హైలెట్ గా నిలవనుందని సమాచారం. అయితే ప్రభాస్ కు క్లాస్ ప్రేక్షకులతో పోలిస్తే మాస్ ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఎక్కువనే విషయం తెలిసిందే.

ప్రభాస్ సన్నిహితులు రాధేశ్యామ్ మూవీ చాలా బాగుందని మంచి ప్రేమకథను అందంగా తెరపైకి తెచ్చారని ప్రశంసించినట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ మూవీ మంచి ఫీల్ ఇచ్చే మూవీలా ఉందని ప్రభాస్ కామెంట్లు చేసినట్లు సమాచారం. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus