Prabhas: అభిమాని ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్..ఎమోషనల్ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ .. ఓ అభిమానిని సర్ప్రైజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో ప్రభాస్ తో పాటు ఉన్న అభిమాని పేరు కన్నయ్య అలియాస్ రంజిత్. ఈ వీడియో ఇప్పటిది కాదు… పాతది.! ఈ వీడియోలో ఉన్న ప్రభాస్ అభిమాని ఇప్పుడు బ్రతికి లేడు. అసలేం జరిగింది.. అంటే..! అప్పటికి కన్నయ్య ఓ రేర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రపంచం మొత్తంలో దానిని క్యూర్ చేసే మెడిసిన్ ఇంకా రాలేదు.

కాబట్టి చివరి రోజులను గడుపుతున్నాడు కన్నయ్య. ఈ క్రమంలో అతని చివరి కోరికలు తీర్చాలని.. ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయ్యి.. తనకు ఇష్టమైన హోటల్ లోకి తీసుకెళ్లి ఫుడ్ పెట్టించడం,ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం జరిగింది. అయినా అతని కళ్ళల్లో ఆనందం వారికి కనిపించలేదు. ఇంకా ఏదో కోరిక అతనికి ఉంది అని గట్టిగా అడిగారు. అప్పుడు కన్నయ్య.. తనకు ప్రభాస్ ను కలవాలని ఉన్నట్లు తెలిపాడు.

దీంతో అతని తల్లి పూరి జగన్నాథ్ భార్య లావణ్యకి ఫోన్ చేసి .. విషయం చెప్పారట. లావణ్య గారు ప్రభాస్ తో మాట్లాడితే.. అదే రోజున కలవడానికి ఒప్పుకున్నారట. అంతే.. కన్నయ్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని ఆరా తీయగా.. ‘చికెన్ మంచూరియా’ కన్నయ్యకి ఇష్టమని తెలిసింది. అంతేకాకుండా బాహుబలి సినిమాలో వాడిన ఏదైనా వస్తువు దొరికినా చాలా హ్యాపీ అని ఆ అభిమాని తెలిపాడట. ఇక కన్నయ్య అలాగే అతని తల్లి ప్రభాస్ ను కలవడానికి వెళ్ళినప్పుడు ప్రభాస్..

తన ఫ్రెండ్ (Prabhas) ప్రభాస్ శీనుతో చికెన్ మంచూరియా తెప్పించి అలాగే బాహుబలి వాడిన కత్తిని బహుమతిగా ఇచ్చాడట ప్రభాస్. అంతేకాకుండా అరగంట సేపు కన్నయ్యతో మాట్లాడాడట ప్రభాస్. ఆ టైంలో అతని కళ్లల్లో నిజమైన ఆనందం కనపడింది అని కన్నయ్య తల్లి తెలిపింది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్ట్రోరీ అది. తన కొడుకు మరణించినప్పటికీ.. తన ఇంట్లోనే విగ్రహం కట్టించుకుంది ఆమె తల్లి.


మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus