Prabhas: వైరల్ అవుతున్న ప్రభాస్ ఫన్నీ ఆన్సర్!

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. మరో ఐదు రోజుల్లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకోగా ఈసారి మాత్రం చెప్పిన డేట్ కే రిలీజవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి.

రాధేశ్యామ్ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్ జాతకాలు, జ్యోతిష్యాల చుట్టూ ఈ సినిమా కథ జరుగుతుందని 1970 కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కిందని ఆ సమయంలోనే ప్రజలు జాతకాలను గట్టిగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సూచనల మేరకు ఈ సినిమాను యూరప్ లో షూట్ చేశామని ఆయన అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు.

తాను, సత్యరాజ్ కలిసి నటించిన మిర్చి, బాహుబలి హిట్ అయ్యాయని ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్లైమాక్స్ లో ప్రేమ గెలుస్తుందా లేక విధి గెలుస్తుందా అని విలేకరి ప్రశ్నించగా రూ.50 పెట్టి సినిమా చూడండి సార్ అని ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చారు. ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ కావడం గమనార్హం. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో ప్రభాస్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న పూజా హెగ్డే ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus