Prabhas: ప్రభాస్‌తో రెండోసారి పని చేస్తున్న ఆ టాలెంటెడ్ టెక్నీషియన్ ఎవరంటే..

హీరో, హీరోయిన్స్, దర్శక నిర్మాతలకు ఒక సినిమా హిట్ అవడం అనేది చాలా ముఖ్యం.. ఎందుకంటే బాగా ఆడితేనే తర్వాత ఆఫర్స్ వస్తాయి.. మరో సినిమా చేయడానికి డబ్బులొస్తాయ్.. తేడా కొడితే మాత్రం తిప్పలు తప్పవు.. అదే టెక్నీషియన్స్ విషయానికొస్తే.. వాళ్లకి దాదాపు హిట్, ఫ్లాపుతో సంబంధం ఉండదనే చెప్పొచ్చు.. ఎందుకంటే ఒకవేళ హిట్ పడితే.. పారితోషికం పెరుగుతుంది.. ఫ్లాప్ అయినా కానీ ఫరక్ పడదు.. టాలెంట్ కారణంగా ఆఫర్స్ వస్తుంటాయి..

ఇప్పుడలానే తెలుగులో రెండు ఫ్లాప్ (టాక్ బాగానే ఉన్నా పెద్దగా ఆడలేదు) సినిమాలు చేసిన ఓ టాలెంటెడ్ టెక్నీషియన్‌కి రెబల్ స్టార్ ప్రభాస్ అవకాశమిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ పళని.. టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్.. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ ఇప్పుడు శంకర్ – రామ్ చరణ్ సినిమాకి పనిచేస్తున్న పాపులర్ కెమెరామెన్ తిరు దగ్గర ‘మెర్కురీ’ (ప్రభు దేవా), రజినీ కాంత్ ‘పేట’ మూవీస్‌కి అసిస్టెంట్‌గా చేసి..

‘లవ్ షాగున్’ అనే హిందీ ఫిలింతో కెమెరామెన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు.. తెలుగులో ఈటీవీ ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ‘నెక్స్ట్ నువ్వే’, ‘బ్రాండ్ బాబు’ రెండిటికీ తనే ఫొటోగ్రఫీ.. కీర్తి సురేష్ ‘పెంగ్విన్’, (తమిళ్), ‘ఫ్రెంచ్ బిర్యానీ’ అనే కన్నడ సినిమా చేశాడు.. డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’ కి కార్తీక్ పళనినే కెమెరామెన్.. అలాగే ఇప్పుడు దళపతి విజయ్ – వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న ‘వారిసు’ (వారసుడు) కి కూడా తనే వర్క్ చేస్తున్నాడు..

ఇప్పుడు పళనికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో అవకాశమిచ్చాడు.. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ – K’ మధ్యలో ఇటీవలే మారుతి దర్శకత్వంలో డార్లింగ్ సైలెంట్‌గా ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ‘ఆచార్య’ ధర్మస్థలి సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ పళని పనిచేస్తున్నాడు. ‘ఆదిపురుష్’ అప్పుడు పళని టాలెంట్ గుర్తించిన డార్లింగ్.. మేకర్స్‌తో మాట్లాడి ఈ ఆఫర్ ఇప్పించాడట.. ‘ఆదిపురుష్’ తో పాటు మారుతి సినిమా కూడా తనకు బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు కార్తీక్..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus