సాహో కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న ప్రభాస్
- August 17, 2017 / 06:57 AM ISTByFilmy Focus
రెండేళ్ల క్రితం రజనీకాంత్ రెమ్యూనరేషన్ 50 కోట్లు అని తెలిసినప్పుడు ముక్కున వేలేసుకొన్నారందరూ. అయితే.. తెలుగు, తమిళం, హిందీతోపాటు చైనాలోనూ విశేషమైన మార్కెట్ కలిగిన హీరో కాబట్టి ఆయనకు ఆమాత్రం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అని ఫిక్సయ్యారు. ఆ తర్వాత కేవలం తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్న ఎన్టీయార్ కు 20 కోట్లు, పవన్ కళ్యాణ్ కు 25 కోట్లు, మహేష్ బాబుకు 27 కోట్ల రెమ్యూనరేషన్ అంటే షాక్ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు “బాహుబలి” వీరుడు ప్రభాస్ కు ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ అని తెలిసేసరికి మిగతా హీరోల అభిమానుల సంగతి ఎలా ఉందో తెలియదు కానీ.. ప్రభాస్ అభిమానులు మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
“బాహుబలి”తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకొన్న ప్రభాస్ ఇకనుండి చేయనున్న ప్రతి సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుండడంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ మామూలుగానే పెరిగింది. కానీ.. ఏకంగా ముప్పై కోట్లు అని తెలిసేసరికి అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటించనున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















