Prabhas: ప్రభాస్ మంచి మనసుకి ఇదొక పెద్ద ఉదాహరణ..!

  • August 5, 2022 / 12:08 PM IST

ప్రభాస్ ఇప్పుడంటే పాన్ ఇండియా స్టార్. కొంచెం గతంలోకి వెళ్లి చూస్తే అతను స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రభాస్ కెరీర్లో మొదటి హిట్ అందుకోవడానికి మూడో సినిమా ‘వర్షం’ వచ్చేవరకు ఆగాల్సి వచ్చింది. తర్వాత మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి 6 వ సినిమా ‘ఛత్రపతి’ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కు వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి.

రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా ప్లాప్ లు తప్పవు అని ప్రభాస్ రూపంలో ఆ టైంలో మరోసారి రిపీట్ అయ్యింది. ‘డార్లింగ్’ తో ప్రభాస్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అటు తర్వాత ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. అటు తర్వాత ‘మిర్చి’ తో ప్రభాస్ స్టార్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు.

అయితే అంతకు ముందు ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ లేదు అని భావించి ఓ సినిమా నుండి తప్పించారట. ఆ సినిమా మరేదో కాదు వెంకటేష్- గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఘర్షణ’. ఈ కథ ముందుగా.. ప్రభాస్ వద్దకే వెళ్ళింది. కానీ ఆ టైంలో ప్రభాస్ ఫామ్లో లేడు అని భావించి, వెంకటేష్ తో కథ చేసుకున్నామని ప్రభాస్ కు చెప్పారట. అందుకు ప్రభాస్ ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా ఓకే చెప్పేసి తన నెక్స్ట్ సినిమాలకు మూవ్ అయిపోయారని తెలుస్తుంది.

తనని సినిమా నుండి తప్పించినప్పటికీ ప్రభాస్ ‘ఘర్షణ’ ఆడియో రిలీజ్ వేడుకకు గెస్ట్ గా వచ్చి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.అమాయకత్వం, మంచితనం ఎక్కువ ఉంటాయి కాబట్టే.. ప్రభాస్ ఇలాంటి విషయాలను పెద్దగా కేర్ చెయ్యడని ఈ విషయంతో అర్థం చేసుకోవచ్చు.ఇక 2004 లో రిలీజ్ అయిన ‘ఘర్షణ’ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus