ప్రభాస్ సినిమా టైటిల్ ను లాగేసుకున్న బాలకృష్ణ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి హ్యాట్రిక్ డిజాస్టర్లతో బాలయ్య ఢీలా పడిపోయాడు. ఈసారి బోయపాటితో చేస్తున్న చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు బాలయ్య.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి కాబట్టి.

.’వీరిద్దరూ ఇప్పుడు చేస్తున్న చిత్రంతో హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తారు’ అని అభిమానులు ధీమాగా ఉన్నారు.అందుకు తగినట్టే టీజర్ కూడా దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను పెడుతున్నారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. ఆ టైటిల్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘సూపర్ మెన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. దాదాపు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అలా అయితే ప్రభాస్ కు బాలయ్య పెద్ద షాక్ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఎందుకంటే అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి కూడా ‘సూపర్ మెన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. కానీ ఇప్పుడు బాలయ్య టీం ఆ టైటిల్ ను తీసుకుంటే.. వారికి పెద్ద షాక్ తగిలినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus