Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నిజంగా గ్రేట్!

స్టార్ హీరో ప్రభాస్ సన్నిహితులు ఆయన మనస్సు చాలా గొప్ప మనస్సు అని చెబుతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు. ఇటీవల రాధేశ్యామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో ఏకంగా 28 మంది ప్రభాస్ ఫ్యాన్స్ కు గాయాలయ్యాయి. ఫ్యాన్స్ కు గాయాలైన విషయం తెలిసి హీరో ప్రభాస్ ఫీల్ అయ్యారని వార్తలు వచ్చాయి.

రాధేశ్యామ్ సినిమా ఈవెంట్ లో గాయపడిన ఫ్యాన్స్ విషయంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమానుల చికిత్స కోసం ప్రభాస్ సహాయం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం హీరో ప్రభాస్ ను మెచ్చుకుంటున్నారు. చాలామంది హీరోలు అభిమానులకు సహాయం చేసే విషయంలో వెనుకడుగు వేస్తారు. ప్రభాస్ మాత్రం అభిమానుల చికిత్సకు సహాయం అందించడం గమనార్హం.

రాధేశ్యామ్ మూవీ 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా రాధేశ్యామ్ కావడం గమనార్హం. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ప్రభాస్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ సినిమాలో పరమహింస అనే పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెరగాల్సి ఉంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus