Prabhas: చనిపోయిన అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న ప్రభాస్!

బాహుబలి, బాహుబలి2 సినిమాలు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలవడంతో పాటు హీరోగా ప్రభాస్ క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచాయి. బాహుబలి2 సక్సెస్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ అంచనాలను అందుకోకపోయినా ఈ సినిమాలకు భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు మాత్రం బాహుబలి2 స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే రాధేశ్యామ్ సినిమా విడుదలైన సమయంలో బ్యానర్ కడుతూ ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి మృతి చెందిన సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

గుంటూరు జిల్లాలోని స్థానిక సినిమా హాల్ దగ్గర రాధేశ్యామ్ మూవీ రిలీజ్ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. మండల అభిమాన సంఘం నాయకుడు ఈ విషయాన్ని ప్రభాస్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభాస్ వెంటనే స్పందించి అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చేశారు. ప్రభాస్ అభిమాని కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందజేశారని సమాచారం. అభిమాన సంఘం నాయకుడు చల్లా అనిల్ ప్రభాస్ ఇచ్చిన చెక్కును పెదకోటి భార్య, తల్లిదండ్రులకు అందజేశారు.

అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థిక సహాయం అందజేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ క్రేజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై కూడా భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రభాస్ మారుతి కాంబో సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ వరుసగా సినిమాలతో బిజీ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఫ్యాన్స్ త్వరలో వింటారని ప్రచారం జరుగుతోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus