రెండు రోజుల్లో ప్రశాంత్ నీల్-ప్రభాస్ మూవీ అనౌన్స్మెంట్!

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిందని.. త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం నాడు తాము నిర్మించబోయే మరో భారీ పాన్ ఇండియా సినిమాను డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్ ప్రభాస్ సినిమా గురించేనని అంటున్నారు. ఈ ట్వీట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోతోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

అయితే ప్రభాస్ తో ప్రశాంత్ చేయబోయే సినిమా ఓ రీమేక్ కథ అని టాక్. అయిదేళ్ల క్రితం కన్నడలో వచ్చిన ‘ఉగ్రమ్’ అనే సినిమాను పాన్ ఇండియా సినిమాగా రీమేక్ చేయబోతున్నారని సమాచారం. కానీ ఒకసారి ఒక భాషలో వచ్చిన సినిమాను మళ్లీ పాన్ ఇండియా సినిమాగా ఎలా రూపొందిస్తారు..? ‘ఉగ్రమ్’ స్కేల్ ని మార్చి భారీ లెవెల్ లో తీస్తారా..? అనే విషయాలు తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. ఏ సబ్జెక్ట్ అయినా జనవరి నుండి ఈ సినిమా సెట్ పైకి వెళ్తుందని అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు. అలానే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్‌లో నటించనున్నారు. ఈ మూడు పాన్ ఇండియా సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాకి రెడీ అవుతున్నారని సమాచారం.


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus