Prabhas: లైఫ్ ఇచ్చిన రాజమౌళిని పక్కన పెట్టేసిన ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈయన ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ పృథ్వీ రాజ్ సుకుమారన్, శృతిహాసన్ ఈ ముగ్గురు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

శృతిహాసన్ ప్రభాస్ ని అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరి మధ్య ప్రభాస్ ఏ డైరెక్టర్ వద్ద కంఫర్ట్ గా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు ప్రభాస్ ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పారు. తాను తన 21 సంవత్సరాల సినీ కెరియర్లో ప్రశాంత్ నీల్ దగ్గర చాలా కంఫర్ట్ గా ఉన్నానని తెలిపారు.

సలార్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా నేను ప్రశాంత్ తో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉండేవాడిని తాను చాలా ఎంటర్టైన్ చేస్తారు అంటూ ప్రశాంత్ గురించి ప్రభాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ దగ్గర నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానని తెలిపారు. అంతకుముందు వివి వినాయక్ వద్ద కూడా ఇలాగే ఉండేవాడిని అంటూ ప్రభాస్ తెలిపారు.

ఇక ప్రభాస్ (Prabhas) నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చత్రపతి బాహుబలి సినిమాలతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెంచిన డైరెక్టర్ రాజమౌళి. ఇలా ప్రభాస్ కు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ని పక్కన పెట్టేసి తనకు ప్రశాంత్, వినాయక్ చాలా కంఫర్టబుల్ డైరెక్టర్స్ అంటూ ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus