Prabhas: రెమ్యునరేషన్ ను అక్కడ పెట్టుబడిగా పెడుతున్న ప్రభాస్.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ (Prabhas) ఒక్కో సినిమాకు కనీసం 70 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ సినిమాల కలెక్షన్లు సైతం ఒకింత భారీ రేంజ్ లోనే ఉన్నాయనే సంగతి తెలిసిందే. సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలు ఫ్యాన్స్ ను అంచనాలు మించి మెప్పించాయి.

ఇటలీలో ప్రభాస్ కు ఖరీదైన బంగ్లా ఉందని, ముంబైలో ఫ్లాట్లు ఉన్నాయని, హైదరాబాద్ శివార్లలో ప్రభాస్ భారీ ఫామ్ హౌస్ ను నిర్మిస్తున్నారని ఈ ఫామ్ హౌస్ ను విలాసవంతంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తెలివిగా పెట్టుబడులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో ప్రభాస్ ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నారని భోగట్టా. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ రాజాసాబ్ (The Rajasaab) సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కన్నప్ప (Kannappa) సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. ఫౌజీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉన్నా ప్రభాస్ తో సినిమాను తెరకెక్కించడానికి ఎక్కువ సంఖ్యలో నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో మరో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజాసాబ్ సినిమాకు భారీ లాభాలు రావడం పక్కా అని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus