స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతోంది. ప్రభాస్ సినిమాలకు ఏకంగా 1500 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ప్రభాస్ ప్రతి సినిమాకు సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గత సినిమాలు షాకింగ్ ఫలితాలను సొంతం చేసుకున్నా ప్రభాస్ మార్కెట్ సైతం పెరుగుతోంది. అయితే ప్రభాస్ కు మన మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. అయితే ఆదిపురుష్ సినిమా ఈవెంట్లు, ప్రమోషన్ కార్యక్రమాలు ముంబైలో ఎక్కువగా జరుగుతుండటంతో ఈ సినిమాకు మన మీడియాలో ఒకింత ప్రాధాన్యత తగ్గిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ మినహా బాలీవుడ్ నటీనటులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా మన మీడియా ఈ సినిమాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా కలెక్షన్లు వస్తాయి. ప్రభాస్ తెలుగు మీడియాపై దృష్టి పెడితే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. సినిమా సినిమాకు ప్రభాస్ పారితోషికం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో (Prabhas) ప్రభాస్ రేంజ్ కు తగిన హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కచ్చితంగా సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్ లలో ప్రభాస్ నటించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?