Prabhas: సూపర్‌ హిట్‌ టైటిల్‌ మిస్‌ అయిన సూపర్‌ స్టార్‌!

టాలీవుడ్‌ హిట్‌ సినిమాలు ఇంకా చెప్పాలంటే హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించిన సినిమాల్లో ‘మిర్చి’ ఒకటి. ప్రభాస్‌ యాటిట్యూడ్‌, నటన, మాస్‌ ఎలివేషన్లకు తగ్గట్టుగా ఆ పేరు పెట్టారు అని అనిపిస్తుంటుంది. కొరటాల శివ అండ్‌ కో ఆ పేరు ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ… నిజానికి ఆ టైటిల్‌ తొలుత అనుకున్నది ప్రభాస్‌కి కాదట. ఆ టైటిల్‌ను మహేష్‌బాబు కోసం రిజర్వ్‌ చేయించారట. కానీ రెబల్‌ దగ్గరకు వెళ్లిపోయింది. మహేష్‌బాబు – దుర్గా ఆర్ట్స్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి.

సినిమాకు అంతా ఓకే అయ్యిందని, త్వరలోనే ముహూర్తం అని కూడా అన్నారు. అంతేకాదు సినిమా కోసం టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌ రిజిస్టర్‌ కూడా చేయించారు. ఆ రోజుల్లో ఆ టైటిల్‌ విని ‘బాబుకు తగ్గ టైటిల్’ అని అందరూ పొంగిపోయారు. అదే ‘మిర్చి’. మాంచి మాస్‌ మసాలా సినిమా పక్కా అనుకున్నారంతా. కానీ ఆ సినిమా మెటీరియలైజ్‌ కాలేదు. దీంతో టైటిల్‌ అలా ఉండిపోయింది. కొరటాల శివ, ప్రభాస్‌ కాంబినేషన్‌లో సినిమా అనుకున్నాక పేరు మాంచి ఘాటుగా ఉండాలని అనుకున్నారట.

అప్పుడే ‘మిర్చి’ టైటిల్‌ గురించి తెలిసి… దుర్గా ఆర్ట్స్‌ను సంప్రదించిన తీసుకున్నారని భోగట్టా. అలా మహేష్‌బాబు చేయాల్సిన ‘మిర్చి’ టైటిల్ ప్రభాస్‌ చేశాడన్నమాట. భలే ఉంది కదా… టాలీవుడ్‌లో ఇలాంటి ఎన్నో జరిగి ఉంటాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తుంటాయి అంతే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus