Prabhas: కృష్ణంరాజు మరణం తర్వాత మొదటిసారి షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉండగా తన పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. కృష్ణంరాజు మరణించడంతో ఆయనకు సంబంధించిన సంస్కరణ సభలు,

సమారాధన సభ అంటూ ప్రభాస్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఈయన తన సినిమా షూటింగులకు కాస్త విరామం ప్రకటించారు. సమారాధన సభ కార్యక్రమాలు పూర్తి కావడంతో ప్రభాస్ తిరిగి తన సినిమా షూటింగులలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నేడు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నటువంటి సలార్ సినిమా షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ శృతిహాసన్ జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరగగా ఈ షెడ్యూల్లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ వంటి బ్లాక్ పోస్టర్ హిట్ రావడంతో ప్రభాస్ సలార్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus