Prabhas: 2026 వరకు ప్రభాస్ డేట్లు కష్టమేనా?

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లు ఇప్పటికే పూర్తయ్యాయి. పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. రాధేశ్యామ్ సినిమా మార్చి నెలలో రిలీజ్ కానుందని వార్తలు వస్తుండగా ఆదిపురుష్ సినిమా ఆగష్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ పై ఉన్నాయి. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ప్రాజెక్ట్ కె సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే ప్రభాస్ ఈ ఐదు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. వార్ మూవీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఒక సినిమాకు, మరో టాలీవుడ్ నిర్మాతకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 2026 సంవత్సరం వరకు ప్రభాస్ డేట్లు ఖాళీగా లేవని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. 2026 సంవత్సరంలోపు ప్రభాస్ నటించిన ఎనిమిది సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రభాస్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పెళ్లి గురించి ప్రభాస్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. 2022 సంవత్సరంలోనైనా ప్రభాస్ పెళ్లి జరుగుతుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పెళ్లి ఆలస్యమయ్యే అవకాశమే లేదని సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus