Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

ప్రభాస్ లైనప్ చూస్తుంటే, అది రాబోయే సినిమాల లిస్ట్ లా లేదు, ‘సీజన్ 2’ల లిస్ట్ లా ఉంది. ‘సలార్ 2’ (శౌర్యాంగ పర్వం), ‘కల్కి’ సీక్వెల్ రెండూ అధికారికంగా లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు మారుతి ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ కూడా సింగిల్ పార్ట్స్ కావని, వాటికి కచ్చితంగా సీక్వెల్స్ ఉంటాయని గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమా కూడా అదే ఫ్రాంచైజీ మోడల్ అంటున్నారు. అంటే, ప్రభాస్ ఒకేసారి దాదాపు ఐదు ఫ్రాంచైజీలలో భాగం కానున్నాడు.

Prabhas

ఇది కేవలం ప్రభాస్ ప్లానింగ్ మాత్రమే కాదు, దర్శకుల వ్యూహం కూడా. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగింది. ఆయనతో సినిమా అంటే అది ఒక ‘ఈవెంట్’. ఆ ఈవెంట్ కోసం సృష్టించిన భారీ ప్రపంచాన్ని, పెట్టిన వేల కోట్ల బడ్జెట్‌ను ఒక్క సినిమాతో ముగించడం దర్శకులకు ఇష్టం లేదు. అందుకే ప్రతిఒక్కరూ తమ కథలను పార్ట్ 2, పార్ట్ 3లుగా విస్తరిస్తున్నారు.

ఈ ఫ్రాంచైజీల వరదలో, సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ ఒక్కటే ఒక వింతలా, ఒంటరిగా నిలబడింది. సందీప్ ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదు, కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు ప్రభాస్ లైనప్‌లోనే అత్యంత ఆసక్తికరమైన, మోస్ట్ యూనిక్ ప్రాజెక్ట్‌గా మారింది. మిగతావన్నీ ఒక కథ కొనసాగింపు అయితే, ఇది మాత్రమే ఒక కొత్త, ఫ్రెష్ స్టోరీ.

దీనికి కారణం సందీప్ వంగ స్టైల్. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ ‘ప్రపంచాలను’ సృష్టిస్తే, సందీప్ వంగ ‘పాత్రలను’ సృష్టిస్తాడు. అర్జున్ రెడ్డి యానిమల్ రెండూ క్యారెక్టర్ డ్రైవెన్ కథలే. ‘స్పిరిట్’ కూడా ఒక ‘కాప్ యూనివర్స్’ కాదు, అది ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘క్యారెక్టర్’ చుట్టూ తిరిగే కథ. సందీప్ కథలు ఒకే భాగంలో మొదలై, అక్కడే ముగుస్తాయి.

అందుకేస్పిరిట్ప్రభాస్‌కు అసలైన పరీక్ష కాబోతోంది. ‘సలార్ 2′కి, ‘కల్కి 2′కి మొదటి భాగాల నుంచి వచ్చిన హైప్ అనేసేఫ్టీ నెట్ఉంటుంది. కానీస్పిరిట్అలా కాదు. ఇది పూర్తిగా కొత్త కథ, కొత్త ప్రపంచం. కేవలం సందీప్ బ్రాండ్, ప్రభాస్ పెర్ఫార్మెన్స్‌పైనే ఆధారపడి బాక్సాఫీస్ వద్ద నిలబడాలి. అందుకే, ఐదు సీక్వెల్స్ మధ్యలో వస్తున్న ఈఒకే ఒక్కస్టాండలోన్ సినిమాపై అంచనాలు వేరే లెవెల్‌లో ఉన్నాయి.

ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus