Prabhas New Look: ప్రభాస్ లుక్ పై నెటిజన్ల కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. పక్కా కమర్షియల్ సినిమా రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ తనను ట్రోల్స్ చేస్తుండటంతో మారుతి సైలెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా మారుతి మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఈ లుక్ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. కొత్త లుక్ లో స్టార్ హీరో ప్రభాస్ అదుర్స్ అనేలా ఉన్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే తమ జాతకం కూడా మారిపోతుందని ఈ హీరోయిన్లు నమ్ముతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం మారుతి చాలా సమయం కేటాయించారు. ప్రభాస్ కు సైతం తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. సలార్ తో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఎక్కువగా రాకపోయినా ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. వరుస ప్రాజెక్ట్ లతో ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. కెరీర్ విషయంలో ప్రభాస్ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ప్రభాస్ సైతం ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus