తెలుగులో ‘మైత్రి మూవీ మేకర్స్’..లా కన్నడలో ‘హోంబలే ఫిలింస్’ సంస్థ బాగా క్లిక్ అయ్యింది.అక్కడ విజయవంతమైన చిత్రాలు అందించి వందల కోట్లు లాభాలు అందుకున్న ఈ సంస్థ.. మెల్ల మెల్లగా టాలీవుడ్లో కూడా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో భారీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంది.
‘‘ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్’…! 2026, 2027, 2028 …లో ఈ ప్రాజెక్టులు. ‘సలార్ 2’ తో మొదలు’ అన్నట్టు ‘హోంబలే’ సంస్థ ప్రకటించింది. ‘సలార్ 2′ ప్రశాంత్ నీల్ కాబట్టి.. మిగిలిన రెండు ప్రాజెక్టులు ఏమై ఉండవచ్చు? ఏ డైరెక్టర్స్ తో ఉండవచ్చు?’ అని మేకర్స్ భావిస్తున్నారు.
ఆల్రెడీ ఈ బ్యానర్లో ‘సలార్’(సీజ్ ఫైర్) చేశాడు ప్రభాస్ (Prabhas). ‘సలార్ 2′(శౌర్యాంగ పర్వం) ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభాస్.. కి ‘హోంబలే’ సంస్థ ఎంత వరకు పారితోషికం చెల్లించనుంది అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.575 కోట్లు ఈ మూడు సినిమాలకి గాను ప్రభాస్ అందుకోబోతున్నట్టు వినికిడి. అంటే ఒక్కో సినిమాకు గాను రూ.191 కోట్లు ప్రభాస్ పారితోషికంగా అందుబోతున్నాడన్న మాట. అంతేకాకుండా 25 శాతం లాభాల్లో వాటా కూడా ఇస్తామని ‘హోంబలే’ సంస్థ ప్రభాస్ కి హామీ ఇచ్చిందట.
‘సలార్’ చిత్రం షారుఖ్ ఖాన్- రాజ్ కుమార్ హిరానీ..ల ‘డంకి’ కితో పోటీపడి మరీ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒకవేళ వేరే సీజన్లో వచ్చి ఉంటే.. అది కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఉండేది. ‘హోంబలే’ సంస్థ నమ్మకం కూడా అదే అయ్యి ఉండవచ్చు.