Prabhas: ఇది ప్రభాస్ కి మాత్రమే కాదు..ఫ్యాన్స్ కి కూడా షాకే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) ప్రస్తుతం ‘ది రాజాసాబ్’  (The Raja saab) సినిమా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మరోపక్క ‘ఫౌజీ’ షూటింగ్ కూడా మొదలైంది. ఈ రెండు సినిమాలకు బ్యాలెన్స్డ్ గా పనిచేస్తున్నాడు ప్రభాస్. దీని తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలు కూడా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2’ (Kalki 2898 AD)  ‘సలార్ 2’  (Salaar)  కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాలి. ఆ దర్శకుల నుండి పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు.

Prabhas

ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) చేయబోయే సినిమా మరో ఎత్తు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్టు ఇది. తొలిసారి ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎప్పుడో చెప్పుకొచ్చాడు. అలాగే ఇందులో హాలీవుడ్ నటుడు డాన్లీ కూడా నటిస్తున్నట్టు టాక్ గట్టిగానే నడుస్తుంది. అంతేకాదు ‘యానిమల్’ (Animal) కంటే ఎక్కువ వయొలెన్స్ తో కూడుకున్న కథ ఇది అని కూడా సందీప్ చెప్పడం జరిగింది.

అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి 4 ఏళ్ళు కావస్తున్నా ఇంకా.. ఇది సెట్స్ పైకి వెళ్ళలేదు. దానికి కారణం దర్శకుడు సందీప్ అనే తెలుస్తుంది. అతను స్క్రిప్ట్ మొత్తం డెవలప్ చేసి.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశాడట. కానీ ఒక్కసారి ‘స్పిరిట్’ (Spirit)  షూటింగ్ మొదలైతే తన సినిమాకే పూర్తి సమయం కేటాయించాలని ప్రభాస్ కి కండిషన్ పెట్టాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దానికి అర్థం కూడా తెలిసే ఉంటుంది కదా..!

‘స్పిరిట్’ కంప్లీట్ అయ్యే వరకు ప్రభాస్ ఇంకో సినిమా చేయకూడదు. ఎందుకంటే.. దాని గెటప్ కూడా వేరుగా ఉంటుంది. అందుకే టైం పట్టినా పర్వాలేదు.. మిగిలిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుని రమ్మని ప్రభాస్ కి చెప్పాడట సందీప్. సాధారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్తే.. సందీప్ కూడా ఎక్కువ టైం తీసుకోడు. తొందరగానే ఫినిష్ చేసేస్తాడు. కానీ హీరో అతని ప్రాజెక్టుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలని అతను ఆశిస్తాడు.

ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus