గూగుల్ ని ఎక్కువమంది అడిగిన ప్రశ్నల్లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ? అనేది ఒకటి. ఈ ప్రశ్న అడిగేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. వారికీ సమాధానం త్వరలోనే దొరకనుంది. ప్రభాస్ పెళ్లికి మంచి ముహూర్తాలు ఉంటే చూడమని పెదనాన్న కృష్ణంరాజు పురోహితులను అడిగారనే వార్త రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈరోజు మరో న్యూస్ బయటికి వచ్చింది. భీమవరంకి చెందిన ఓ వ్యాపారవేత్త మనవరాలు ప్రభాస్ కి భార్య కాబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని స్పష్టం చేస్తున్నారు.
ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి కంక్లూజన్ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్ సాహో చిత్రం షూటింగ్ కోసం సిద్దమవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తొలి షెడ్యూల్ ముంబైలో మొదలు కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ చెప్పే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.